సెప్టెంబర్‌ 27 నుంచి పితృదేవతలకు శ్రాద్ధకర్మలు

ఒక తరం వెళ్లిపోతుంది.. మరో తరం వస్తుంది. కానీ తరాల మధ్య కనిపించని బంధంగా స్మృతి కొనసాగుతూనే ఉంటుంది. పూర్వీకులను స్మరించుకుంటూ వారి పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు భారతీయ సంస్కృతి ప్రత్యేకంగా కేటాయించిన కాలమే పితృపక్షం లేదా మహాలయ పక్షం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే ఈ రోజుల్లో పితృదేవతలకు శ్రాద్ధకర్మలు, పిండప్రదానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న మహాలయ పక్షం ప్రారంభం కానుంది. మనిషి పుట్టినరోజును, వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుని వేడుకలు చేసుకుంటాం. కానీ తమకంటే ముందున్న తరాలను స్మరించుకునేందుకు ప్రత్యేకంగా ఒక పక్షాన్ని కేటాయించుకున్న అరుదైన సంస్కృతి భారతీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. అందుకే...