మిస్సింగ్‌ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.. టాటూతో కళ్యాణి గుర్తింపు!

విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించారు. ఆమె చేతిపై ఉన్న నల్లని ఈక టాటూ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 17న కళ్యాణి అదృశ్యమైన రోజే హత్యకు గురై ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. కాగా, భవానీపురానికి చెందిన షఫీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కళ్యాణికి, షఫీకి గతంలో పరిచయం ఉందని, కుమారుడి విషయంలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చని భావిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.