చిన్నారి తేజను ఆశీర్వదించిన ఈగ దామోదర్
వర్ధన్నపేట పీఏసీఎస్ డైరెక్టర్ కొండేటి మహేందర్ మనవడు కొండేటి తేజ తొలి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్ చిన్నారి తేజను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తేజ కేక్ కట్ చేయగా నాయకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కేక్ తినిపించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కొండేటి బాలకృష్ణ, తుమ్మల రవీందర్, కొండేటి సుధాకర్, శివరాత్రి ఎల్లస్వామి, శివరాత్రి వెంకట్‌నర్సు, ఐత సుధాకర్, విలాసారపు వెంకట్, ఎండీ సోహెల్, ఎస్కే షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.