తెలంగాణలో వినాయక నిమజ్జనాలు ప్రశాంతం.. 13 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా కొనసాగినప్పటికీ, పది రోజుల ఉత్సవాల్లో జరిగిన వివిధ ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. మొత్తం 13 మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు అని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డీజీపీ వివరాల ప్రకారం, నిమజ్జన బందోబస్తు విధుల్లో పాల్గొన్న కొత్తగూడెం ఎస్సై వెంకన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. సైబరాబాద్‌లోని పటాన్చెరులో ఆరుగురు యువకులు, ఖైరతాబాద్‌లో ఒకరు, నిర్మల్‌లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. డీజే శబ్ద కాలుష్యం కారణంగా కూడా కొందరు ఆరోగ్య సమస్యలకు గురై మృతి చెందినట్లు తెలిపారు.ఈ ఏడాది గణేష్ పోర్టల్‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదు కాగా, ఇళ్లలో ఏర్పాటు...