గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై బీఆర్‌ఎస్ సమీక్ష

హైదరాబాద్: రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ హాజరయ్యారు. ఎన్నికల సన్నాహాలు, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, నాయకులు–కార్యకర్తల సమన్వయంపై సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.