ఉమ్మడి వరంగల్‌లో గర్జించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

వరంగల్: జీవో 97ను వ్యతిరేకిస్తూ తెలంగాణలో ప్రారంభమైన పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ తీవ్రరూపం దాల్చింది. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విద్యార్థులు ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు ర్యాలీగా ములుగురోడ్డు జంక్షన్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. హనుమకొండలో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది నిరసనలకు దిగారు. మహబూబాబాద్‌లో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. కేసముద్రంలోనూ రాస్తారోకో జరిగింది....