ఏపీలో అధికారుల బదిలీలపై అక్టోబర్‌ 9 వరకు నిషేధం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) విధుల్లో ఉన్న కీలక అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నిషేధాన్ని అక్టోబర్‌ 9 వరకు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధుల్లో నిమగ్నమైన సంబంధిత అధికారులకు నిషేధం వర్తించనుంది.