ఇంట్లో గంజాయి మొక్కల పెంపకం.. వ్యక్తి అరెస్ట్‌!

మహబూబాబాద్‌: పట్టణంలోని బాబునాయక్‌తండాలో ఇంట్లో అక్రమంగా గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో సెప్టెంబర్‌ 26న గుగులోత్‌ మంగిలాల్‌ (40) ఇంటిని తనిఖీ చేయగా బాత్రూమ్‌ సమీపంలో రెండు గంజాయి మొక్కలు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.3 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మొక్కలను స్వాధీనం చేసుకుని మంగిలాల్‌పై కేసు నమోదు చేశారు. జిల్లాలో ఎవరైనా గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడితే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.