చాలా ఏళ్ల తర్వాత సినిమా చూసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ చాలా ఏళ్ల విరామం తర్వాత థియేటర్లో సినిమా చూడబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని చూడనున్నట్లు తెలిపారు. తనకు నాని ఎంతో ఇష్టమైన నటుడని, శ్రీకాంత్ ఓదెల ప్రతిభావంతమైన యువ దర్శకుడని పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు సినిమా వసూళ్లపై చిత్ర బృందం సానుకూలంగా స్పందిస్తోంది.