రూ.300 దర్శనం టికెట్లకు భారీ డిమాండ్!
తిరుమల: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్‌పై భక్తుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు టీటీడీ వివరణ ఇచ్చింది. భారీ డిమాండ్ కారణంగానే టికెట్లు తక్కువ సమయంలో పూర్తవుతున్నాయని, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని స్పష్టం చేసింది. Google Cloud Platform, Load Balancing, Auto Scaling, Distributed Architecture, Horizontal Scaling వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. టికెట్ల విడుదల సమయంలో ప్రత్యేక టెక్నికల్ వార్‌రూమ్ ఏర్పాటు చేసి అప్లికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లావాదేవీలు, భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. రూ.2.69 లక్షల కోటా.. 24 లక్షల వరకు డిమాండ్... అధిక డిమాండ్ సమయంలో సుమారు 6 లక్షల...