తొమ్మిదేళ్ల న్యాయపోరాటం తర్వాత తమిళనాడు న్యాయవాది స్నేహకు ప్రత్యేక గుర్తింపు

హైదరాబాద్‌ : కులం, మతం అనే గుర్తింపులకు అతీతంగా జీవిస్తున్న తమిళనాడుకు చెందిన న్యాయవాది ఎం.ఏ. స్నేహ పార్థిబరాజా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తనకు కులం, మతం లేవని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం పొందారు. 2019 ఫిబ్రవరి 5న తిరుపత్తూర్‌ తహసీల్దార్‌ టి.ఎస్‌. సత్యమూర్తి ఈ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు అందుబాటులో ఉన్న వివరాలు పేర్కొంటున్నాయి. తొమ్మిదేళ్ల ప్రయత్నం.. చిన్ననాటి నుంచే తన పాఠశాల, జనన ధ్రువపత్రాల్లో కులం, మత వివరాలు నమోదు చేయకుండా పెరిగిన స్నేహ.. ప్రభుత్వ రికార్డుల్లోనూ అదే విధంగా గుర్తింపు పొందేందుకు సుమారు తొమ్మిదేళ్లపాటు ప్రయత్నించినట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. చివరకు ఆమె ప్రయత్నం...