విద్య, వైద్యంపై ప్రభుత్వంతో యుద్ధం: TRS చీఫ్ కవిత

హైదరాబాద్‌: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల పరిస్థితిపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందని ఆరోపించిన ఆమె.. విద్య, వైద్యంపై ప్రభుత్వంతో యుద్ధం ప్రకటిస్తున్నామని అన్నారు. పరిపాలన చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చిన్నారుల మరణాల ఘటనపై బాధపడని వారుండరని కవిత అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. రిమ్స్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఘటన తర్వాత మంత్రి ఆసుపత్రిని సందర్శించినా సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు, భద్రతా చర్యలపై దృష్టి...