కోతి మద్యం తాగిన దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్

రాంచీ: మద్యం దుకాణంలోకి చొరబడిన ఓ కోతి సీసాను తీసుకుని తాగినట్లు కనిపిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జార్ఖండ్‌లోని రాంచీలో ఈ ఘటన జరిగింది.వైరల్‌ వీడియోలో కోతి మద్యం సీసాను తీసుకుని, పళ్లతో మూత తొలగించి నేరుగా నోటికి పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత నడవలేక తూలుతూ నేలపై పడిపోయినట్లు వీడియోలో ఉంది. అనంతరం అది అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కోతి ఆరోగ్య పరిస్థితి, దానికి చికిత్స అందించారా అనే వివరాలు తెలియరాలేదు. స్థానికులు ఈ దృశ్యాలను మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు సరదాగా స్పందించగా, జంతువులకు హానికరమైన...