రూ.1.01 లక్షల విలువైన కలప సీజ్.. కేసు నమోదు
బయ్యారం: రేంజ్ పరిధిలోని లక్ష్మీపురం సెక్షన్ పాండిపాంపుల బీట్ భీమ్లాతండాలో అటవీశాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.57,059 విలువైన 0.3674 సీఎంటీ టేకు కలప, రూ.43,996 విలువైన 0.4436 సీఎంటీ నాన్-టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1,01,055 విలువైన కలపను సీజ్ చేసిన అధికారులు పీఓఆర్ నంబర్ 35/41, తేదీ 26.09.2026 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.