సహారా డిపాజిటర్ల సొమ్ము చెల్లించాలంటూ డిమాండ్‌

హన్మకొండ:సహారా ఇండియా సంస్థలో డిపాజిట్‌ చేసి మోసపోయిన బాధితులకు పూర్తి సొమ్మును వడ్డీతో సహా చెల్లించాలని సహారా బాధితుల సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి జాతీయ బ్యాంకుల ద్వారా డిపాజిటర్లకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో బాధితులు, ఏజెంట్లు కలిసి ధర్నా నిర్వహించారు.