భుక్యా భాషా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ భుక్యా శ్రీలత తండ్రి భుక్యా భాషా నాయక్ ఇటీవల మృతి చెందడంతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తండాలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భాషా నాయక్ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ శిభారాణి రాజేందర్, ఈగ దామోదర్, నరకుడు వెంకటయ్య, అబ్బిడి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు