రూ.1.75 లక్షల విలువైన పీడీఎస్ బియ్యం సీజ్

వరంగల్ : నెక్కొండ మండలం పనికర గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. గర్నపల్లి జితేందర్‌రెడ్డి ఇంట్లో 50 క్వింటాళ్ల (5,000 కిలోలు) పీడీఎస్ బ్రోకెన్ రైస్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.1.75 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ సీఐ సుబ్బా రెడ్డి తెలిపారు. కేసు నమోదు నిమిత్తం స్వాధీనం చేసిన బియ్యాన్ని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.