పోషణ మాసంతో ఆరోగ్యవంతమైన సమాజం
వర్ధన్నపేట: మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సూచించారు. చిన్నారుల్లో రక్తహీనత నివారణ, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి పండ్లు, పసుపు–కుంకుమ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, PACS చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.