పోషణ మాసంతో ఆరోగ్యవంతమైన సమాజం...ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన పౌష్టికాహారం అందించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. చిన్నారుల్లో రక్తహీనత నివారణ, సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతం నిర్వహించి పండ్లు, పసుపు–కుంకుమ అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.