కొనారెడ్డి చెరువును నింపేందుకు చర్యలు

వర్ధన్నపేట: కొనారెడ్డి చెరువును నింపి రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు పట్టణ అధ్యక్షుడు ఈగ దామోదర్ తెలిపారు. ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఆదేశాలతో కోనాచలం కట్ట నుంచి చెరువు వరకు ఉన్న కాలువలో జేసీబీతో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. గతంలోనూ కాలువను శుభ్రం చేసి నీటిని చెరువుకు మళ్లించినట్లు 7వ వార్డు అధ్యక్షుడు శివరాత్రి ఎల్లస్వామి తెలిపారు. చెరువు నిండితే రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గుతాయన్నారు.