కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి!

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. క్వాంగో ప్రావిన్స్‌లోని కెంజ్‌ ప్రాంతంలో విమానం కుప్పకూలడంతో ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులు సహా 14 మంది మృతి చెందారు. మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బకుమి లికులియా ఉన్నారు. కిక్విట్‌ నుంచి కిన్షాసాకు వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై అనుమానాలు.. ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఘటన... కాంగోలో చాలాకాలంగా భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. తూర్పు కాంగోలో కాంగో సైన్యం పలు తిరుగుబాటు గ్రూపులతో పోరాడుతోంది....