శ్రీరంగనాథ స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ!

వనపర్తి: శ్రీరంగాపురంలోని ప్రసిద్ధ శ్రీరంగనాథ స్వామి ఆలయ సముదాయంలో చోరీ కలకలం రేపింది. ఆలయ ప్రాంగణంలోని రాములవారి గుడిలో ఉన్న శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దుండగులు ఆలయంలోకి ఎలా ప్రవేశించారు, చోరీ ఎప్పుడు జరిగింది తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.