అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ ప్రారంభం

హన్మకొండ: జేఎన్‌ఎస్‌ స్టేడియంలో 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌, ఖేలో ఇండియా యూత్‌ అండర్‌–18 సెలక్షన్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, సీపీ శ్వేతారెడ్డితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో అజీజ్‌ఖాన్‌, పింగళి వెంకటరెడ్డి, కొంకా హరిబాబు, శివరాం, అథ్లెటిక్స్‌ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.