చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. హన్మకొండ న్యూ శాయంపేట చౌరస్తాలోని ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు సమాజం ప్రోత్సహించాలని, మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్...