59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్‌గా ఎంపిక
హైదరాబాద్: పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ నిరూపించారు. 27 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆయనకు 59 ఏళ్ల వయసులో ఎట్టకేలకు కల నెరవేరింది. బాగ్పత్ జిల్లా బడ్రవాడ్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ 1999లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించేందుకు పోటీ పరీక్షలు రాయడం ప్రారంభించారు. పలుమార్లు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్వ్యూలో తుది ఎంపికకు దూరమయ్యారు. TGT పరీక్షను ఆరుసార్లు, PGT పరీక్షను నాలుగుసార్లు ఉత్తీర్ణత సాధించడంతో పాటు దాదాపు ఎనిమిదిసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అయినా పట్టుదల వీడకుండా గత 26 ఏళ్లుగా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే...