సీనియర్ జర్నలిస్ట్ అమరేందర్ రావును పరామర్శించిన నిమ్స్ డైరెక్టర్

హైదరాబాద్: అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్, రాఫ్తార్ టీవీ సౌత్ ఇండియా ఇన్‌చార్జ్ బి. అమరేందర్ రావును నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పరామర్శించారు. అమరేందర్ రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, అందుతున్న చికిత్సపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని డాక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. చికిత్స సమయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని అమరేందర్ రావుకు సూచించారు. పరామర్శించిన డైరెక్టర్‌కు అమరేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.