తాళ్ల మల్లేశం మృతి విద్యా రంగానికి తీరని లోటు
రంగల్, సెప్టెంబర్ : ప్రముఖ విద్యావేత్త, తాళ్ల పద్మావతి విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ తాళ్ల మల్లేశం (73) మృతి విద్యా రంగానికి తీరని లోటని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. గిర్మాజీపేటలోని మృతుడి స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 1981లో 11 మంది విద్యార్థులతో ‘లర్నర్స్ ల్యాండ్’ పాఠశాలను ప్రారంభించి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు విద్యాసంస్థలను అభివృద్ధి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, గోరంటాల రాజు తదితరులు పాల్గొన్నారు.