*నూతన పీఏసీఎస్ చైర్మన్ అబ్బీడి రాజిరెడ్డికి ఘన సన్మానం*
వర్ధన్నపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్గా ఇటీవల నియమితులైన అబ్బీడి రాజిరెడ్డిని యూత్ కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అబ్బీడి రాజిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కుల్ల యాకాంతం, పీఏసీఎస్ ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్, వర్ధన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఐనవోలు టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్...