సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులపై ఉన్నతాధికారుల సమీక్ష

వరంగల్ నగరంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, సీఎం కార్యాలయ కార్యదర్శి కె. మాణిక్‌రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి డా. గౌరవ్ ఉప్పల్‌ ఆస్పత్రి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, వివిధ ఆస్పత్రి బ్లాకుల పురోగతి, మౌలిక వసతులు, విద్యుత్‌, నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి, మిగిలిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని,...