భారత పాస్‌పోర్ట్ రంగుల వెనుక అర్థం ఏమిటి?
హైదరాబాద్: విదేశీ ప్రయాణానికి పాస్‌పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. భారతదేశంలో పాస్‌పోర్ట్‌ల రంగులు వాటి వర్గీకరణ, ప్రయోజనాన్ని సూచిస్తాయి. సాధారణంగా భారతీయులకు నీలిరంగు పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. వ్యక్తిగత, విద్య, ఉద్యోగ, వ్యాపార, పర్యాటక ప్రయాణాలకు దీనిని ఉపయోగిస్తారు. తెలుపు పాస్‌పోర్ట్ అధికారిక విధుల కోసం విదేశాలకు వెళ్లే ప్రభుత్వ అధికారులు, సంబంధిత ప్రభుత్వ ప్రతినిధులకు జారీ అవుతుంది. మెరూన్ లేదా డార్క్ రెడ్ పాస్‌పోర్ట్ దౌత్యపరమైన హోదా కలిగిన వ్యక్తులు, నిర్దిష్ట కేటగిరీల్లోని ప్రభుత్వ ఉన్నతాధికారులకు జారీ చేసే డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్. ఆరెంజ్ రంగు విషయానికి వస్తే.. దీనిపై కొంతకాలంగా సోషల్ మీడియాలో భిన్నమైన సమాచారం ప్రచారంలో ఉంది. వాస్తవానికి పాస్‌పోర్ట్ బుక్‌లెట్ మొత్తం...