గణపయ్య వేగం గంటకు 0.67 కిలోమీటర్లే!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకలు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఖైరతాబాద్‌ బడా గణేష్‌. ఏటా భారీ విగ్రహంతో భక్తులను ఆకట్టుకునే ఖైరతాబాద్‌ గణపయ్యను నిమజ్జనానికి తరలించడం కూడా అంతే ఆసక్తికరమైన ప్రక్రియ. ఏకంగా 40 టన్నుల బరువున్న భారీ విగ్రహాన్ని 26 టైర్ల ప్రత్యేక టస్కర్‌పై అత్యంత నెమ్మదిగా ట్యాంక్‌బండ్‌ వైపు తరలిస్తారు. ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాలకు ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 1954లో స్వాతంత్ర్య సమరయోధుడు సింగరి శంకరయ్య ఆధ్వర్యంలో కేవలం ఒక అడుగు ఎత్తున్న విగ్రహంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఏటా విగ్రహం ఎత్తును పెంచుతూ వచ్చారు. 2014లో 60 అడుగులకు చేరిన విగ్రహం.. 2024లో 70 అడుగుల...