UGC-NET జూన్‌ 2026 ఈ-సర్టిఫికెట్లు విడుదల

హైదరాబాద్‌: NTA నిర్వహించిన UGC-NET జూన్‌ 2026 పరీక్షలకు సంబంధించిన ఈ-సర్టిఫికెట్లు అందుబాటులోకి వచ్చాయి. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తమ JRF, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పీహెచ్‌డీ అడ్మిషన్‌కు సంబంధించిన ఈ-సర్టిఫికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు ugcnet.nta.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి అవసరమైన లాగిన్‌ వివరాలను నమోదు చేసి ఈ-సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సర్టిఫికెట్‌లో పేరు, రోల్‌ నంబర్‌, సబ్జెక్ట్‌, అర్హత కేటగిరీ తదితర వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. UGC-NET అర్హత సాధించిన వారికి నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా నియామకం, పీహెచ్‌డీ ప్రవేశం, JRF వంటి అవకాశాలు లభిస్తాయి. ఈ-సర్టిఫికెట్‌ను భవిష్యత్‌ అవసరాల కోసం భద్రపరచుకోవాలని అధికారులు సూచించారు....