22ఏ రిజిస్ట్రేషన్లపై ఊరట!
హైదరాబాద్: తెలంగాణలో 22ఏ నిషేధిత జాబితాలో చేరిన భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లపై నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం పరిష్కార మార్గం చూపుతోంది. ముఖ్యంగా GHMC, HMDA, DTCP వంటి సంబంధిత అధికార సంస్థల నుంచి అనుమతులు పొందిన లేఅవుట్లలో ఉన్న ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ముఖ్యమంత్రి అసెంబ్లీలో 22ఏ సమస్యల పరిష్కారానికి పలు చర్యలను ప్రకటించగా, అనుమతులు ఉన్న లేఅవుట్లలో పెండింగ్ రిజిస్ట్రేషన్లను పరిశీలించి పరిష్కరించే విధానం ఉంటుందని వెల్లడించారు. దీంతో సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆస్తి యజమానులకు ఊరట లభించే అవకాశం ఏర్పడింది. చట్టబద్ధంగా అనుమతులు పొందిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ, భూమి...