సైడ్ కాలువలో పడి యువకుడి మృతి.. గ్రామంలో విషాదం
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సైడ్ కాలువలో పడి రాజు అనే యువకుడు మృతి చెందాడు. గురువారం కాలువలో తేలియాడుతున్న మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.