గొడవతో మనస్తాపం.. పురుగుమందు తాగిన మహిళ మృతి

మహబూబాబాద్: గూడూరు మండలం భూపతిపేటకు చెందిన తేజావత్ ద్వాలి (69) మనస్తాపంతో పురుగుమందు తాగి మృతి చెందారు. ఎస్సై రమేశ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి దారి విషయంలో గ్రామానికి చెందిన జక్కుల మునేశ్‌తో బుధవారం ద్వాలికి గొడవ జరిగింది. ఈ సందర్భంగా తనను కులం పేరుతో దూషించి అవమానించారని ఆమె మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. దీంతో పురుగుమందు తాగిన ద్వాలిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.