కేరెల్లికి చేరుకున్న మల్లన్న పాదయాత్ర
వికారాబాద్: బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్ర కేరెల్లికి చేరుకుంది. యాత్ర 8వ రోజులో భాగంగా వికారాబాద్ నుంచి పాదయాత్రగా కేరెల్లికి చేరుకున్న తీన్మార్ మల్లన్నకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేరెల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు తీన్మార్ మల్లన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు, పార్టీ నాయకులతో కలిసి బీసీ రాజ్యాధికార యాత్రను కొనసాగించారు. కేరెల్లి నుంచి బాచారం వైపు పాదయాత్ర ముందుకు సాగుతోంది.