నాసిరకం బొగ్గుతో జెన్‌కోకు రూ.2,900 కోట్ల నష్టం: బీఆర్‌ఎస్‌ నేతలు

భూపాలపల్లి: కాకతీయ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్‌ తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. పవర్‌ ప్లాంట్లకు నాసిరకం బొగ్గు సరఫరా కావడంతో విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడుతోందని నేతలు ఆరోపించారు. నాసిరకం బొగ్గు కారణంగా జెన్‌కోకు రూ.2,900 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్‌ సంస్థల నుంచి భారీగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. సింగరేణి...