‘ది ప్యారడైజ్’.. అంచనాలను అందుకుందా?

హనుమకొండ: నాని–శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ ఘన విజయం సాధించడంతో.. అదే కాంబోలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్‌, టీజర్‌, ‘ఆయా షేర్‌’, ‘ఏష నాగుల కట్ట’ వంటి ప్రమోషనల్‌ కంటెంట్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ట్రైలర్‌ లేకుండానే విడుదలైనప్పటికీ బజ్‌ మాత్రం కొనసాగింది. కథేంటి? గుర్తింపు కోసం సవారీ జాతి చేసే పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది. సమాజంలో తమకంటూ ఓ స్థానం కోసం వారు ఎదుర్కొనే అవమానాలు, సంఘర్షణలను దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరపై ఆవిష్కరించారు. ఈ పోరాటంలో నాని పాత్ర కీలకంగా మారుతుంది. ఎలా ఉందంటే.. కథను విభిన్నంగా చెప్పే...