ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక..!
హైదరాబాద్ : ఖైరతాబాద్ లో ఉపఎన్నికకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. బీఆర్‌ఎస్ తరఫున 2023లో గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ వ్యవహారంపై దాఖలైన అనర్హత పిటిషన్లలో హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించి ఖైరతాబాద్ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించడంతో ఉపఎన్నికకు ఉన్న న్యాయపరమైన అడ్డంకుల్లో కీలకమైనది తొలగిపోయింది. ఇప్పుడు అసలు ఆసక్తి అభ్యర్థుల ఎంపికపైనే. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్‌కు మరోసారి అవకాశం ఇస్తారా? లేక కొత్త ముఖాన్ని రంగంలోకి దింపుతారా? అనే...