దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

న్యూఢిల్లీ: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దానం నాగేందర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన ధర్మాసనం.. దానం నాగేందర్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పు అమల్లో కొనసాగనుంది.