పనీర్‌, మిల్క్‌ పౌడర్‌, హల్వా, వంటనూనెలు సీజ్‌

హైదరాబాద్‌: మల్కాజిగిరి ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్‌ టీమ్‌ (M-FAST), స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (SOT) మల్కాజిగిరి సంయుక్తంగా అల్వాల్‌, దుండిగల్‌లోని ఆహార తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించాయి. అల్వాల్‌లోని నటరాజ్‌ మిల్క్‌ అండ్‌ మిల్క్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌లో సుమారు 500 కిలోల లూజ్‌ పనీర్‌, 50 కిలోల స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుండిగల్‌లోని మిసెస్‌ యశోద స్వీట్‌ అండ్‌ నమ్కీన్‌లో స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌, 21 కిలోల తయారుచేసిన హల్వా, సుమారు 100 టిన్ల ఫ్రీడమ్‌ ఆయిల్‌, 50 టిన్ల డాల్డాను సీజ్‌ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత వ్యక్తులను ఆయా పోలీస్‌ స్టేషన్లకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.