వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయమైన కుటుంబం
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని సన్నూరు గ్రామంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దడిగెల నర్సమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. వర్షానికి గోడలు పూర్తిగా తడిసి బలహీనపడటంతో ఇల్లు నేలమట్టమైనట్లు బాధిత కుటుంబం తెలిపింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా కుటుంబం నిరాశ్రయమైంది. తాము నిరుపేద కుటుంబానికి చెందినవారమని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని నర్సమ్మ పాలకులను వేడుకున్నారు.