నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్-2027కు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని మహదేవపూర్ ఎంఈవో పురుషోత్తం రెడ్డి తెలిపారు. 9వ తరగతికి 8వ తరగతి, 11వ తరగతికి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపిక పరీక్ష 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు.