కేటీపీపీ సందర్శనకు బ్రేక్‌.. బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు కేటీపీపీ సందర్శనకు పార్టీ నేతలు సిద్ధమైన నేపథ్యంలో భూపాలపల్లిలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీపీపీని సందర్శించనున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీపీపీ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బలగాలను మోహరించారు.