23 ఏళ్లకే ‘డాక్టర్’ అవతారం.. ఫేక్ క్లినిక్ గుట్టురట్టు!
హైదరాబాద్: వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ చికిత్స చేస్తున్నాడన్న ఆరోపణలపై 23 ఏళ్ల మహమ్మద్ అద్నాన్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. హిక్మా సెహత్ కేర్ సెంటర్‌పై దాడి చేసిన పోలీసులు లేబుల్స్ లేని మందుల బాటిళ్లు, ప్యాకెట్లు, ప్రిస్క్రిప్షన్ పుస్తకాలు, సోషల్ మీడియా ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఛాతీనొప్పి, శ్వాస, కిడ్నీ, యూరినరీ సమస్యలకు చికిత్స చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. అతడి తల్లి, సోదరుడు కూడా వ్యవహారంలో భాగస్వాములని పోలీసులు చెబుతుండగా.. వారు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. సంబంధిత బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.