తీరాన్ని దాటిన తీవ్ర వాయుగుండం!

విశాఖ: కలింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్లూరి, ఏలూరు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. యానం, అంబేద్కర్‌ కోనసీమ, కాకినాడ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.