9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

వరంగల్‌: రాబోయే 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు సూచిస్తున్నాయి. వరంగల్‌, హనుమకొండ పరిసరాల ప్రజలు అత్యవసర ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదు. విద్యుత్‌ స్తంభాలు, తెగిపోయిన వైర్లకు దూరంగా ఉండాలి. భారీ వర్షంలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని అధికారులు సూచించారు.