వృద్ధుల దినోత్సవానికి దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ జిల్లాలో: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సన్మానాలకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు. వివిధ రంగాల్లో సేవలందించిన వృద్ధులు, వృద్ధుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తులు, సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సేవల వివరాలు, ధ్రువపత్రాలు, ఫొటోలు, ఆధారాలతో ఈ నెల 26లోగా నామినేషన్లు సమర్పించాలని సూచించారు.