సమిష్టి కృషితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం....టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీవారి సేవకులు, మీడియా, భక్తుల సమిష్టి కృషితో విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు ఎనిమిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చిన భక్తులకు వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తి దర్శనం కల్పించినట్లు తెలిపారు. మొత్తం 5.76 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.28.94 కోట్ల కానుకలు లభించాయి. 33 లక్షల లడ్డూలు విక్రయించగా, 21.84 లక్షల...