వినాయక నిమజ్జనానికి సెప్టెంబర్ 25న సెలవు
హైదరాబాద్: వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 25న సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు వర్తించనుంది. ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీ రెండో శనివారం రోజును వర్కింగ్ డేగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.